హైదరాబాద్ 29°C
అమరావతి 33°C
IST 5:08 PM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

దక్షిణాది సినిమాల్లో పెరుగుతున్న ప్రీక్వెల్‌ ట్రెండ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
దక్షిణాది సినిమాల్లో పెరుగుతున్న ప్రీక్వెల్‌ ట్రెండ్
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

దక్షిణాది సినీ రంగంలో సీక్వెల్స్ కు బదులుగా ప్రీక్వెల్స్ రూపొందించే ధోరణి పెరుగుతోంది. ఇప్పటికే పలు ప్రముఖ చిత్రాల మేకర్స్ ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

తమిళ చిత్రం 'సార్పట పరంపర' తన రెండో భాగాన్ని ప్రీక్వెల్ గా ప్రకటించింది. రంజిత్ దర్శకత్వంలో నటుడు ఆర్య నటించనున్నారు. నటుడు రజినీకాంత్ నటించిన 'వెట్టయన్' చిత్రానికి కూడా ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని దర్శకుడు జ్ఞానవేల్ తెలిపారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా మొదలు కాలేదు.

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో వచ్చిన 'లూసిఫర్' పార్ట్‌2 'ఎంపురాన్' ఖురేషి అబ్రామ్ బ్యాక్‌స్టోరీని ప్రీక్వెల్‌గా ఆవిష్కరించింది. కన్నడ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కాంతార' చాప్టర్‌2 కూడా ప్రీక్వెల్ రూపంలోనే వచ్చింది.

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రీక్వెల్‌ల సంఖ్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే చాలా సినిమాలు ప్రీక్వెల్‌లేనని టాక్ నడుస్తోంది. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోయే 'ఇండియన్ 3' కూడా ప్రీక్వెల్ అనే సూచనలు ఇచ్చారు మేకర్స్.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com