ఆధ్యాత్మికం

పూరీ జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాల ప్రత్యేకతలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పూరీ జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాల ప్రత్యేకతలు
📷 Government of Odisha / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

పూరీ జగన్నాథ ఆలయంలో 22 మెట్లు, 22 తత్వాలకి సంకేతంగా ఉంటాయి. ఆలయానికి నాలుగు ద్వారాలు ఉండి, ఒక్కో ద్వారం ఒక్కో పురుషార్థాన్ని సూచిస్తుంది.

తూర్పు ద్వారాన్ని సింహద్వారం అంటారు. ఇక్కడ రెండు సింహాలు ఉంటాయి. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. ఆలయ శిఖరంపై ఉన్న సుదర్శన చక్రం నగరంలో ఎక్కడి నుంచి చూసినా సమీపంగా కనిపిస్తుంది.

ఉత్తర ద్వారం హస్తిద్వారం. ఇక్కడ ఏనుగులు ఉంటాయి. ఈ మార్గం నుంచి ప్రవేశిస్తే అర్థం, అంటే సుఖ సంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. పశ్చిమ ద్వారం వ్యాగ్రద్వారం. ఇక్కడ పులి విగ్రహాలు ఉంటాయి. ఈ ద్వారం ధర్మానుష్టానం కోసం ఉద్దేశించబడింది.

దక్షిణ ద్వారం అశ్వద్వారం. ఇందులో రెండు గుర్రాల విగ్రహాలు ఉంటాయి. ఈ మార్గంలో వెళ్తే కామం ఈశ్వర కామంగా మారుతుందని చెప్తారు. భగవంతుడిని తగిన విధంగా కోరుకోవాలనే సందేశం ఇక్కడ ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com