రాహుల్ గాంధీ నా బైక్ ఎక్కడం చాలా హ్యాపీ: గిగ్ రైడర్ లలిత
హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ బైక్ రైడర్ లలిత బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణించారు. ఆ ర్యాలీలో పలువురు రైడర్లు పాల్గొన్నారు. వారి మధ్యలో లలిత కూడా ఉన్నారు.
"గారు వచ్చి కూర్చోగానే హాయ్ అని పలకరించారు. బైక్ నడుపుతున్నప్పుడు నెమ్మదిగా నడపమని సూచనలు ఇస్తూ వచ్చారు" అని లలిత తెలిపారు. తన బైక్‌పై రాహుల్ గాంధీ కూర్చోవడం చూసి తాను షాక్ అయ్యానని ఆమె చెప్పారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని లలిత అన్నారు.
ఒక వ్యక్తి రాహుల్ గాంధీని తన బైక్ దగ్గరకు తీసుకొచ్చి కూర్చోబెట్టారని ఆమె వివరించారు. "హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో రాహుల్ గాంధీతో కలిసి బైక్ నడపడం చాలా బాగా అనిపించింది. నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను" అని లలిత చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com