జాతీయం

విజయ్ పై అసూయ లేదు: రజినీకాంత్ స్పష్టీకరణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విజయ్ పై అసూయ లేదు: రజినీకాంత్ స్పష్టీకరణ
📷 Mark Stebnicki / Pexels
షేర్ కాపీ అయింది ✓

నటుడు రజినీకాంత్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. విజయ్ ముఖ్యమంత్రి కావడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు.

విజయ్ CM కాకుండా తాను అడ్డుకున్నారని వస్తున్న ప్రచారాన్ని రజినీకాంత్ ఖండించారు. బెంగళూరు వెళ్తూ airport లో ఒక వ్యక్తి విజయ్ CM అవుతున్నారని చెప్పాడని, తాను చిరునవ్వుతో వెళ్ళిపోయానని తెలిపారు. దాన్ని కొందరు వక్రీకరించారని అన్నారు.

తనకు విజయ్ పై అసూయ లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, రాజకీయాల్లో లేనప్పుడు అసూయకు తావు లేదన్నారు. విజయ్తో తనకు దాదాపు 25 ఏళ్ల తేడా ఉందని, చిన్నప్పటి నుంచి విజయ్ను చూస్తున్నానని చెప్పారు.

ఎంజిఆర్, ఎన్టీఆర్ మాదిరిగా సినీ రంగం నుంచి వచ్చి రెండు పెద్ద పార్టీలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్న విజయ్ ప్రయాణం చిన్న విషయం కాదని రజినీకాంత్ అన్నారు. BJP బలంగా ఉన్నా విజయ్ తన శైలిలో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు.

స్టాలిన్ తనకు మంచి మిత్రుడని, స్నేహితుడిగా మాత్రమే కలిశానని రజినీకాంత్ వెల్లడించారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని కూడా స్పష్టం చేశారు.

ప్రజల్లో విజయ్ పై పెద్ద అంచనాలు ఉన్నాయని, వాటిని ఆయన నెరవేర్చాలని ఆకాంక్షించారు. విజయ్కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com