జాతీయం

అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌లో విరాళాల చోరీ ఆరోపణలు: చంపత్రాయ్ రాజీనామా, జులై 22న నూతన సభ్యుల నియామకం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అయోధ్య రామమందిర్ ట్రస్ట్‌లో విరాళాల చోరీ ఆరోపణలు: చంపత్రాయ్ రాజీనామా, జులై 22న నూతన సభ్యుల నియామకం
📷 Trishik Bose / Pexels
షేర్ కాపీ అయింది ✓

అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ విరాళాల చోరీ ఆరోపణలపై సమావేశమై, సెక్రెటరీ చంపత్రాయ్ రాజీనామాను ఆమోదించింది. చంపత్రాయ్ స్థానంలో కృష్ణమోహన్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మాట్లాడుతూ, చంపత్రాయ్ ఎటువంటి తప్పు చేయలేదని, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేసి మంచి సందేశమిచ్చారని తెలిపారు. విరాళాల చోరీ ఆరోపణలతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. రాముడి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, మీడియాకు వాటిని చూపించామని పేర్కొన్నారు. 2800 కానుకలు భద్రంగా ఉన్నట్లు ట్రస్ట్ ప్రకటించింది.

మార్చి 31 నాటికి ఆలయానికి 582 కోట్ల విరాళాలు వచ్చాయని ట్రస్ట్ తెలిపింది. ఇందులో 391 కోట్లు నిర్వహణకు ఖర్చు కాగా, మిగిలిన సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేశామని వెల్లడించింది.

ఈ నెల 22న మరో సమావేశంలో ట్రస్ట్ కొత్త సభ్యులను నియమిస్తుంది. అదే రోజు విరాళాల చోరీ కేసుపై సిట్ నివేదిక వస్తుందని, దోషులకు కఠిన శిక్ష పడేలా ప్రయత్నిస్తామని తాత్కాలిక సెక్రెటరీ కృష్ణమోహన్ తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com