IPL 2026 టైటిల్ వరుసగా రెండోసారి RCB సొంతం — గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల విజయం
IPL 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. వరుసగా రెండోసారి టైటిల్ సాధించిన RCB అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ అర్ధసెంచరీతో ఒంటరి పోరాటం చేసి జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. సుందర్ 50, నిశాంత్ సింధు 20, జోష్ బట్లర్ 19 పరుగులు చేశారు. RCB బౌలర్లలో రసిక సలాం మూడు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ మరియు ఏజిల్ వర్డ్ చెరో రెండు వికెట్లు సాధించారు.
156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చివరి వరకు క్రీజ్‌లో ఉండి 75 పరుగులు చేసి జట్టును విజయతీరానికి చేర్చాడు. వెంకటేష్ అయ్యర్ 32, టిమ్ డేవిడ్ 24 పరుగులు సహకరించారు. గుజరాత్ తరపున రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా వైభవ్ సూర్యవంశి ఎంపికయ్యాడు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com