ప్రేమను నిరాకరించినందుకు యువతి కుటుంబంపై కత్తితో దాడి
హైదరాబాద్ లోని రాయదుర్గంలో ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతి కుటుంబంపై కత్తితో దాడి చేశాడు. గోవర్ధన్ అనే యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఎండ్ల బస్తీకి చెందిన యువతిని గోవర్ధన్ ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడు. ప్రేమను నిరాకరించడంతో కక్షతో ఆమె కుటుంబం నివాసంలోకి చొరబడ్డాడు. ఆ సమయంలో యువతి సోదరిపై కత్తి గొంతుపై పెట్టి బెదిరించాడు. తల్లిదండ్రులు అడ్డుకోగా వారిపైనా దాడికి తెగబడ్డాడు.
ఇంట్లో నుంచి విన్న అరుపులతో స్థానికులు వచ్చి నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై రాయదుర్గం పోలీసులు నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com