హైదరాబాద్ 27°C
అమరావతి 33°C
IST 10:53 AM
మంగళవారం సెప్టెంబర్ 1 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్‌లో రూ.52 కోట్ల మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జ్ ప్రారంభం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్‌లో రూ.52 కోట్ల మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జ్ ప్రారంభం
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లో మూసి నదిపై కొత్తగా నిర్మించిన మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించారు. ఇది నాలుగు లేన్లతో అందుబాటులోకి వచ్చింది.

మూసి నదిలో 1.50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ఈ బ్రిడ్జి పిల్లర్లను బలంగా నిర్మించారు. అంబర్ పేట, గోలనాక, కాచిగూడ ప్రాంతాల నుంచి మూసారాంబాగ్, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనదారులకు వర్షాకాలంలో ఇబ్బందులు తగ్గనున్నాయి.

మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నదిపై అవసరమైన చోట్ల మరిన్ని వంతెనలు నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం GHMC, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల కొత్త లోగోలను ఆవిష్కరించారు. GHMC నుంచి రెండు కార్పొరేషన్లను విడగొట్టిన తర్వాత ఈ లోగోలు రూపొందించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత GHMC కి కొత్త లోగో వచ్చింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com