జాతీయం

రితబ్రత బెనర్జీ వర్గం TMC ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం; మమతా వర్గం ఆరోపణలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
రితబ్రత బెనర్జీ వర్గం TMC ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం; మమతా వర్గం ఆరోపణలు
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

తృణమూల్ కాంగ్రెస్ (TMC) లోని రెబెల్ వర్గం నేడు కోల్‌కతా మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది.

రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని ఈ వర్గం, కార్యాలయం గేట్ల తాళాలు మార్చి, కొత్త పోస్టర్లు అంటించింది. లోపల సమావేశం నిర్వహించి, ఇక నుంచి ఇదే పార్టీ హెడ్ ఆఫీస్ అని ప్రకటించారు. భవన యజమానులతో ఒప్పందం పూర్తయిందని, పార్టీ అన్ని సంస్థాగత కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తామని చెప్పారు.

మెయిన్ గేట్ దగ్గర అరూప్ రాయ్ ను TMC చైర్మన్ గా పేర్కొంటూ పోస్టర్ ఏర్పాటు చేశారు. అయితే ఆఫీస్ లోపల మమతా బెనర్జీ ఫోటోలు, కటౌట్లను తొలగించలేదు. ఇవాళ్టి నుంచి పార్టీ అఫీషియల్ కార్యకలాపాలు ఇక్కడే ప్రారంభమవుతాయని రితబ్రత బెనర్జీ ప్రకటించారు.

ఈ విషయం తెలియగానే మమతా వర్గం ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకున్నారు. కానీ గేట్లకు తాళాలు వేసి ఉండటంతో లోపలికి ప్రవేశించలేకపోయారు. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసుల మద్దత్తోనే రెబెల్ వర్గం ఈ చర్యలు చేసిందని మమతా బెనర్జీ నేతృత్వంలోని నేతలు విమర్శించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com