నేరాలు

విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోరీ యత్నం, బ్యాంక్ సిబ్బందిపై దాడి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
విశాఖలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోరీ యత్నం, బ్యాంక్ సిబ్బందిపై దాడి
📷 ‫צור אייזקס‬‎ / Pexels
షేర్ కాపీ అయింది ✓

విశాఖపట్నం కంచరపాలెం ఐటీఐ జంక్షన్ సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోరీ చేయడానికి గుర్తు తెలియని వ్యక్తి ప్రయత్నించాడు.

బ్యాంకులో బంగారు నగలను అపహరించేందుకు ప్రవేశించిన వ్యక్తిని బ్యాంక్ మేనేజర్ శివరామరాజు, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో నిందితుడు వారిపై సుత్తితో దాడి చేశాడు.

దాడిలో మేనేజర్, మరో సిబ్బంది గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంచరపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు బ్యాంకు మాజీ ఉద్యోగి రవి కుమార్గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బ్యాంకులోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com