నంద్యాల: వరదలో మునిగిన సంగమేశ్వర క్షేత్రం.. గర్భగుడిలోకి నీరు
నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లో కృష్ణానది తీరాన ఉన్న సప్తనది సంగమేశ్వర క్షేత్రం వరద నీటిలో మునిగింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మకు వచ్చిన వరద ప్రవాహం ఉదృతంగా కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి చేరుతున్న ఈ వరద నీరు ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి, అక్కడ వెలసిన శివలింగాన్ని పూర్తిగా ముంచెత్తింది. ఆలయ సంప్రదాయం ప్రకారం సప్తనది దేవతలకు ప్రత్యేక పూజలు, మంగళ హారతులు నిర్వహించారు.
ఈ ఏడాది ఆగస్టు 1న గర్భగుడిలోకి నీరు చేరగా, గత సంవత్సరం జూన్ 15న ఇదే పరిస్థితి ఏర్పడింది. గతేడాది జూన్ 15న మునిగిన ఆలయం మార్చి 22న తిరిగి బయటపడింది. అంటే ఈ ఏడాది 131 రోజుల పాటు మాత్రమే స్వామివారు నీటి నుంచి బయటపడి పూజలు అందుకున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో మరో పది రోజుల్లో ఆలయం పూర్తిగా జలమయం కానుంది.
శ్రావణ మాసంలో భారీ వరదలతో ఆలయం నీట మునగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం కృష్ణా జలాలను శ్రీశైలం రిజర్వాయర్‌కు మళ్లిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com