హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 11:32 AM
సోమవారం ఆగస్టు 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

స్వదేశీ ఎయిర్ టాక్సీ 'షైలా 1.0' ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
స్వదేశీ ఎయిర్ టాక్సీ 'షైలా 1.0' ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతం
📷 Abdulkadir Emiroğlu / Pexels
షేర్ కాపీ అయింది ✓

భారత స్టార్టప్ Sarla Aviation అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ 'Shyla 1.0' ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసింది. టేకాఫ్, గాలిలో నిలదొక్కుకోవడం, నియంత్రణ వ్యవస్థలు, పవర్ మేనేజ్‌మెంట్, భద్రత వంటి కీలక అంశాలపై పరీక్షలు జరిపారు. అన్ని వ్యవస్థలు ఆశించిన విధంగా పనిచేసినట్లు సంస్థ ప్రకటించింది.

ఇది EVTOL (Electric Vertical Take-Off and Landing) శ్రేణికి చెందిన ఎయిర్ క్రాఫ్ట్. హెలికాప్టర్ లాగా నిటారుగా ఎగరగలదు. రన్వే అవసరం లేకుండా చిన్న ప్రదేశంలో ల్యాండ్ అవుతుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది కాబట్టి శబ్ద కాలుష్యం తక్కువ. ఇంధన ఖర్చు, కార్బన్ ఉద్గారాలు కూడా చాలా తగ్గాయి.

ప్రపంచవ్యాప్తంగా నగర రవాణా భవిష్యత్తు కోసం ఇలాంటి EVTOL టెక్నాలజీపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా, చైనా, యూరప్, UAE వంటి దేశాలు ఇప్పటికే ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు భారత స్టార్టప్ కూడా అదే దిశగా అడుగులు వేయడం విశేషం.

Shyla-1.0 ను మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్, విపత్తు సహాయక చర్యలు, మారుమూల ప్రాంతాలకు సరుకు రవాణా, నగరాల్లో ట్రాఫిక్ జామ్ తగ్గించే ఎయిర్ టాక్సీగా, పర్యాటక రంగంలో ఉపయోగించే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. విశ్లేషకులు ఈ విజయాన్ని 'Make In India', 'Startup India' కార్యక్రమాలకు మరో ప్రోత్సాహకంగా అభివర్ణించారు. భారత్ అత్యాధునిక విమాన సాంకేతికతను అభివృద్ధి చేసే దేశంగా ఎదుగుతోందనడానికి ఇది రుజువు అని పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com