దర్శకుడు శంకర్ కుమారుడు ఆర్జిత్ హీరోగా ఎంట్రీ; 'లవర్ బాయ్'లో కృతి శెట్టి హీరోయిన్
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమారుడు ఆర్జిత్ శంకర్ హీరోగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. 'లవర్ బాయ్' అనే చిత్రంతో ఆయన హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఈ యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో గుర్తింపు పొందిన యువ నటి కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు.
గురువారం చెన్నైలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ చిత్రానికి అశోక్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, ఫ్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com