గాయని ఎస్. జానకి మృతికి స్వగ్రామం పల్లపట్లలో విషాదం
ప్రముఖ గాయని ఎస్. జానకి మృతితో ఆమె స్వగ్రామం బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలోని పల్లపట్లలో విషాదం నెలకొంది. జానకి పల్లపట్లలో జన్మించారు. మూడేళ్ల వయసు వరకు ఇక్కడే నివసించారు.
ఆమె తండ్రి శ్రీరామమూర్తి శాస్త్రి, తల్లి లక్ష్మమ్మ. తండ్రి సంగీత ఉపాధ్యాయుడు కావడంతో జానకి చిన్నతనంలోనే తల్లిదండ్రుల నుంచి సంగీతం నేర్చుకున్నట్లు గ్రామస్థులు గుర్తు చేసుకున్నారు. ఆ కుటుంబం మూడు సంవత్సరాల తర్వాత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లింది. దగ్గరి బంధువులు కూడా చాలా ఏళ్ల క్రితమే గ్రామాన్ని వీడారు.
గ్రామస్థులు ఆమెను ఎంతో అభిమానించేవారు. సినిమాల్లో జానకి పాట వినిపించగానే ‘ఈ పాట మా జానకమ్మ పాడింది’ అని గర్వంగా చెప్పుకునేవారని వారు తెలిపారు. ఆమె 2004లో ఒకసారి స్వగ్రామానికి వచ్చి కొంతమందిని కలిసింది. అప్పుడు ఆమె కాలికి గాయం కావడంతో అందరితో కలవలేకపోయింది. ఆమెను గ్రామ దేవాలయానికి తీసుకెళ్లాలని గ్రామస్తులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు.
గ్రామంలో జానకి కుటుంబానికి కొంత ఆస్తి ఉండేది. ఇటీవల ఆ స్థలాన్ని అమ్మేశారు. పల్లపట్లలో జన్మించి శిఖర స్థాయికి చేరిన జానకి మరణం గ్రామాన్ని బాధించిందని స్థానికులు చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com