వెంకటగిరి రైల్వే స్టేషన్‌కు డిస్ప్లే బోర్డులు, ఫ్లైఓవర్: వెంకటగిరి రాజా ప్రకటన
వెంకటగిరి రైల్వే స్టేషన్‌లో త్వరలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు వెంకటగిరి రాజా సర్వజ్ఞ కుమార యాచంద్ర ప్రకటించారు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రతి రోజూ వందలాది మంది వెంకటగిరి స్టేషన్ నుంచి నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అయితే స్టేషన్‌లోని కోచ్ డిస్ప్లే బోర్డులు చెడిపోవడంతో ప్రయాణికులు తమ బుక్ చేసుకున్న బోగీ ఎక్కడ వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యపై వెంకటగిరి రాజా తిరుపతి ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ సానుకూలంగా స్పందించారు. డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో పాటు నాయుడు పీఠం వైపు వెళ్లే మార్గంలో రైల్వే ఫ్లై ఓవర్ నిర్మాణంపై కూడా ఎంపీ ఆసక్తి చూపినట్లు చెప్పారు.
వెంకటగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరు కృషి చేసినా తాను అభినందిస్తామని రాజా స్పష్టం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com