జాన్వీ కపూర్‌తో మల్టీ స్టారర్ సినిమాకు ఓకే చెప్పిన శ్రీలీల
నటి శ్రీలీల బాలీవుడ్‌లో మరో సినిమాకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్‌తో కలిసి లేడీ ఓరియెంటెడ్ మల్టీ స్టారర్‌లో నటించనున్నారు. ఉమేష్ బీస్ట్ దర్శకత్వంలో ఏక్తా కపూర్, గునీత్ మోంగా నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందనుంది.
ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో ఒకే అబ్బాయిని ఇష్టపడే ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగే కథను ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు సమాచారం. శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటున్నారు.
ఆమె ఇప్పటికే కార్తీక్ ఆర్యన్‌తో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. అది త్వరలో విడుదల కానుంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ కొడుకుతో మరో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
తెలుగులో ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాలు చేసిన శ్రీలీల, తమిళంలో ధనుష్, అజిత్‌ల సినిమాల్లోను నటించనున్నారు. మొత్తంగా హిందీ, తమిళ భాషల్లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com