స్వీట్ డ్రింక్స్ వల్ల ఏటా లక్షల మందికి డయాబెటిస్, హార్ట్ వ్యాధులు: పరిశోధన
అమెరికాలోని Tufts University పరిశోధకులు 184 దేశాల డేటా సేకరించి చేసిన అధ్యయనంలో స్వీట్ డ్రింక్స్ వల్ల ఏటా మూడు నుండి నాలుగు లక్షల మంది చనిపోతున్నారని తేల్చారు.
ఈ పరిశోధన ప్రకారం, ప్రతి సంవత్సరం 22 లక్షల కొత్త డయాబెటిస్ కేసులు, 12 లక్షల హార్ట్ సంబంధిత కేసులు స్వీట్ డ్రింక్స్ వల్ల వస్తున్నాయి. పది డయాబెటిక్ కేసుల్లో ఒకటి ఈ పానీయాల వల్లే అని అధ్యయనం తెలిపింది.
79% కేసుల్లో స్వీట్ డ్రింక్స్ కు తీవ్రమైన వ్యాధులకు నేరుగా సంబంధం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. Cambridge University కూడా ఈ అధ్యయన ఫలితాలను నిర్ధారించింది.
చిన్నప్పుడు స్వీట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్న వారికి పెద్దయిన తర్వాత డయాబెటిస్, ఊబకాయం, హార్ట్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని Cambridge University పరిశోధకులు హెచ్చరించారు.
స్వీట్ డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ మాత్రమే కాదు. Packaged juices, energy drinks, flavored milk కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటిలో nutritional విలువ శూన్యం. అయితే పెద్ద మొత్తంలో ఉండే sugar శరీరంలో insulin ను దెబ్బతీస్తుందని నిపుణులు వివరించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com