తమిళనాడులో సినిమాలకు రోజుకు 5 షోలు — CM విజయ్ నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే తమిళ చిత్రాలకు మొదటి వారం రోజులు రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
ఇప్పటివరకు ఐదో షో వేయాలంటే నిర్మాతలు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఇకపై ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్మాతలు, distributors, థియేటర్ యజమానులు కలిసి అదనపు షోలు నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేశారు.
CM విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత Kollywood సినీ ప్రముఖులు ఆయనను కలిశారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని కోరారు.
నటుడు, MP కమల్ హాసన్ సైతం CM విజయ్‌ను కలిసి తమిళ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సూచనలు చేశారు. కొత్త చిత్రాలకు అదనపు షోలు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నిర్ణయం వెలువడింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com