టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల ఆలస్యం — పాన్ ఇండియా ట్రెండ్‌దా? ప్రణాళిక లోపమా?
టాలీవుడ్‌లో అగ్ర హీరోలు ఇటీవల రెండు మూడేళ్ల బ్రేక్‌లతో సినిమాలు చేస్తున్నారు. 2024లో ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ తెరపై కనిపించలేదు. ఆయన తదుపరి చిత్రం ‘AA22’ (అట్లీ దర్శకత్వం) ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం లేదు.
మహేష్ బాబు ‘గుంటూరు కారం’ రిలీజై రెండేళ్లు దాటింది. ఆయన నెక్స్ట్ సినిమా 2027 ఏప్రిల్ లోనే విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ‘దేవర’ (2024) తర్వాత ‘వార్ 2’ లో నటించినా, ఆ సినిమా దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో ఆయన సొంత సినిమా గ్యాప్ కూడా రెండేళ్లు దాటింది.
ఈ పెద్ద గ్యాప్‌ల వల్ల బాక్సాఫీస్‌పై ప్రభావం పడుతోంది. ఆలస్యానికి ప్రధాన కారణం పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భారీ కాస్టింగ్, అంతకుమించిన విజువల్ ఎఫెక్ట్స్ అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సమయం ఎక్కువవడంతో సినిమాలు ఆలస్యమవుతున్నాయని టాక్.
కానీ మలయాళ, హిందీ ఇండస్ట్రీలలో అగ్ర స్టార్లు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయగలుగుతున్నారు. ఈ వేగం టాలీవుడ్ హీరోలకు ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పాన్ ఇండియా ట్రెండ్ కారణమా లేక హీరోల ప్రణాళికా లోపం కూడా ఉందా అనేది ఇప్పుడు చర్చనీయాంశం.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com