హైదరాబాద్ 27°C
అమరావతి 30°C
IST 6:41 PM
శుక్రవారం ఆగస్టు 7 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

ఢిల్లీలో భారీ వర్షం: ఓపెన్ డ్రైనేజీలో పడిపోయిన ముగ్గురు విద్యార్థులు, స్థానికుల చర్యతో ప్రాణాలకు హాని లేదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఢిల్లీలో భారీ వర్షం: ఓపెన్ డ్రైనేజీలో పడిపోయిన ముగ్గురు విద్యార్థులు, స్థానికుల చర్యతో ప్రాణాలకు హాని లేదు
📷 Bijen Amatya / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఢిల్లీలోని జగత్పూర్ ప్రాంతంలో రోడ్డుపై డ్రైనేజీ మూత తెరిచి ఉండడంతో ముగ్గురు విద్యార్థులు అందులో పడిపోయారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఢిల్లీలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీనికి తోడు అక్కడక్కడ డ్రైనేజీ మూతలు తెరిచి ఉన్నాయి. జగత్పూర్‌లో రోడ్డుపై భారీగా నిలిచిన నీళ్లలో నడుస్తున్న విద్యార్థులు ఈ నీటిలో దాగి ఉన్న ఓపెన్ డ్రైనేజీలో వరసగా పడిపోయారు.

మిగతా పిల్లలు అరవడంతో సమీపంలో ఉన్న డ్రైవర్లు, స్థానికులు వెంటనే డ్రైనేజీలోకి దూకి ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com