హైదరాబాద్ 27°C
అమరావతి 35°C
IST 3:08 PM
మంగళవారం జూలై 28 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయికి: సర్వదర్శనానికి 8 గంటలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థాయికి: సర్వదర్శనానికి 8 గంటలు
📷 VARAN NM / Pexels
షేర్ కాపీ అయింది ✓

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ సోమవారం సాధారణ స్థాయికి చేరింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. ఇటీవలి రోజుల్లో భారీ రద్దీతో క్యూ కాంప్లెక్స్ బయట శిలాతోరణం వరకు భక్తులు వరుసలో నిలిచేవారు.

ఆదివారం 90 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా దాదాపు 5 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి లభించింది.

ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 8 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com