షూటింగ్ అయినా రిలీజ్ డేట్ లేని టాలీవుడ్ సినిమాలు
టాలీవుడ్‌లో అనేక సినిమాల షూటింగ్ పూర్తయినా రిలీజ్ డేట్‌లపై స్పష్టత రాలేదు. నిర్మాతలు, దర్శకులు ఇంకా నిర్ణయం తేల్చలేదు.
చిరంజీవి నటించిన విశ్వంభర షూటింగ్ పూర్తయి ఏడాదిన్నర దాటింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 2026లో విడుదల కావచ్చని సమాచారం.
నటుడు నిఖిల్ నటించిన స్వయంభు షూటింగ్ పూర్తైంది. VFX పనులు జరుగుతున్నాయి. ఆ output చూసిన తర్వాతే రిలీజ్ డేట్ ఖరారు చేస్తామని మేకర్స్ నిర్ణయించారు.
నటుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు చిత్రాన్ని 2025 సెప్టెంబర్ 25న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే షూటింగ్ ఆలస్యంకావడంతో అది కుదరలేదు. ఇప్పటికీ డేట్ ఖరారు కాలేదు.
నటుడు నాగచైతన్య నటించిన వృషకర్మ షూటింగ్ చివరి దశకు వచ్చింది. మంచి సమయం చూసుకొని రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ చెప్తున్నారు.
దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ శేతుపతి నటించిన స్లమ్ డాగ్ షూటింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com