హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 1:06 PM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

సినీ నటుల షూటింగ్ అప్‌డేట్స్: ఎక్కడ ఎవరు ఏ సినిమా చేస్తున్నారంటే..

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సినీ నటుల షూటింగ్ అప్‌డేట్స్: ఎక్కడ ఎవరు ఏ సినిమా చేస్తున్నారంటే..
📷 Pixabay / Pexels
షేర్ కాపీ అయింది ✓

ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాల షూటింగ్‌లు వివిధ చోట్ల జరుగుతున్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, నటుడు బాలకృష్ణ గాయాల కారణంగా షూటింగ్‌కు కొన్ని వారాల పాటు విరామం ఇచ్చారు. ఇటీవలే విరామం ముగించుకున్న నటుడు చిరంజీవి, ఆర్‌ఎఫ్‌సీలో ‘బాబీ’ సినిమా షూటింగ్‌లో నిమగ్నమయ్యారు.

నాని, శ్రీకాంత్ నటిస్తున్న ‘పారడైజ్’, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘అధీర’, సంపత్ నంది, భోగి అవసరాల, శ్రీనివాస్ సినిమా, వంశీ నందిపాటి నిర్మిస్తున్న ‘పొలిమేరా 3’ షూటింగ్‌లు ముచ్చింతల్‌లో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా షూటింగ్ ముంబైలో కొనసాగుతోంది. ‘వారణాసి’ సినిమా షూటింగ్ 40 రోజులుగా శంషాబాద్ తాహిర్ స్టూడియోలో జరుగుతోంది. శివనిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ సినిమా పీలేరు పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది.

వెంకటేష్, కళ్యాణరామ్ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం అజీజ్ నగర్‌లో షూటింగ్ అవుతోంది. శ్రీవిష్ణు ‘రామబ్బరాజు’ షూటింగ్, సాయిధరం తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్ శంకరపల్లిలో నాలుగు వారాలుగా జరుగుతున్నాయి. గోపీచంద్, వెంకట్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సింగ’ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ‘రణబాలి’ షూటింగ్ గండిపేటలో జరుగుతోంది. ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ కోకాపేటలో కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com