హైదరాబాద్ 25°C
అమరావతి 26°C
IST 1:56 AM
ఆదివారం ఆగస్టు 2 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళీ బోనాలకు సర్వం సిద్ధం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సికింద్రాబాద్ ఉజ్జైని మహంకాళీ బోనాలకు సర్వం సిద్ధం
📷 Hemant Singh Chauhan / Pexels
షేర్ కాపీ అయింది ✓

సికింద్రాబాద్‌లోని ఉజ్జైని మహంకాళీ అమ్మవారి బోనాల జాతరకు సర్వం సిద్ధమైంది. రేపు బోనాలు, ఎల్లుండి రంగం, భవిష్యవాణి, అంబారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా.

దీని కోసం ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. పరిసరాల్లో బారికేడ్లు పెట్టారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కేవలం నడక ద్వారా మాత్రమే ఆలయానికి వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

భద్రత కోసం 2500 మంది పోలీసులను మోహరించారు. ట్రాఫిక్ డైవర్షన్లు కూడా అమలు చేశారు. రేపు ఉదయం 3.30 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. అనంతరం ధర్మకర్త కుటుంబం నుంచి మొదటి బోనము సమర్పించనున్నారు. మధ్యాహ్నం 1.00 గంటల నుండి 3.00 గంటల వరకు శివసక్తులకు ప్రత్యేక సమయం కేటాయించారు.

భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ ఏర్పాట్లు చేశారు. మహిళల భద్రత కోసం షీ టీమ్‌లను నియమించారు. మద్యం దుకాణాలు మూసివేస్తూ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com