హైదరాబాద్ 29°C
అమరావతి 34°C
IST 11:34 AM
సోమవారం ఆగస్టు 17 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
అంతర్జాతీయం

జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు: ట్రంప్ ఆదేశాలు తోసిపుచ్చిన కోర్టు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జన్మహక్కు పౌరసత్వంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు: ట్రంప్ ఆదేశాలు తోసిపుచ్చిన కోర్టు
📷 Shealeah Craighead / Wikimedia Commons / public-domain
షేర్ కాపీ అయింది ✓

అమెరికాలో జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇచ్చే జన్మహక్కు పౌరసత్వం (birthright citizenship)పై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. H-1B, F-1, L-1 వంటి వీసాలపై ఉన్న విదేశీ తల్లిదండ్రులకు అక్కడ జన్మించిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వరాదని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల చేసిన నిర్ణయాన్ని కోర్టు తోసిపుచ్చింది.

ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ భారతీయులు, చైనా, జపాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల పౌరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనల తర్వాత, అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డా అమెరికన్ పౌరుడేనని, తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పుపై స్పందించిన ట్రంప్, ఇది అమెరికన్లకు వెన్నుపోటని, దేశంలో అమెరికన్ల సంఖ్య తగ్గుతూ విదేశీయులే ఎక్కువవుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ లో చర్చిస్తానని ఆయన తెలిపారు.

అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఈ తీర్పు ఊరట కలిగించింది. ప్రస్తుతానికి జన్మహక్కు పౌరసత్వం కొనసాగనుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com