హైదరాబాద్ 25°C
అమరావతి 26°C
IST 10:32 PM
ఆదివారం సెప్టెంబర్ 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

30 ఏళ్ల పైబడిన మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ పెరుగుతున్నాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
30 ఏళ్ల పైబడిన మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ పెరుగుతున్నాయి
📷 Fahad Puthawala / Pexels
షేర్ కాపీ అయింది ✓

30 ఏళ్లు దాటిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి గర్భాశయ ఫైబ్రాయిడ్స్ సమస్య ఉంటోందని వైద్యులు తెలిపారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఈ సమస్యను పెంచుతున్నాయని వారు చెప్తున్నారు.

ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయ గోడల్లో పెరిగే గడ్డలు. ఇవి క్యాన్సర్ కాదు. అయినప్పటికీ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్యులు తెలిపారు. 30 నుండి 50 ఏళ్ల మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. 30 ఏళ్ల లోపు వారికీ రావచ్చని వైద్యులు చెప్తున్నారు.

చాలా మందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలియదు. లక్షణాలు ఏమీ కనిపించకుండా ఉండవచ్చు. కొంతమందికి పొట్ట ఉబ్బు, హెవీ bleeding, నెలసరి సమస్యలు వస్తాయి. పొత్తి కడుపు నొప్పి, మలబద్ధకం, నడుము నొప్పి, మూత్రం తరచుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

హార్మోన్ల అసమతుల్యత, వంశపారంపర్య కారణాలు, ఊబకాయం వల్ల ఈ గడ్డలు ఏర్పడతాయని వైద్యులు వివరించారు. Pelvic ultrasound scan ద్వారా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చని తెలిపారు.

చిన్న గడ్డలను మందుల ద్వారా, పెద్దవాటిని laparoscopic myomectomy surgery ద్వారా తొలగించవచ్చని వైద్యులు చెప్పారు. గర్భాశయాన్ని కాపాడుకుంటూనే చికిత్స చేయవచ్చని స్పష్టం చేశారు. పౌష్టిక ఆహారం తీసుకోవడం, రోజువారీ వ్యాయామం చేయడం, హార్మోన్లను అదుపులో ఉంచుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చని సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com