హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 8:56 AM
సోమవారం ఆగస్టు 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

వడ్డివారిపాలెంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు సార సమర్పణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వడ్డివారిపాలెంలో ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు సార సమర్పణ
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

బాపట్ల జిల్లా రేపల్లె తాలూకా వడ్డివారిపాలెం గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలకు సార సమర్పణ కార్యక్రమం నిర్వహించారు.

గ్రామస్తులు మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లారు. అంకాల దేవత పాకాలమ్మ తల్లికి పండ్లు, స్వీట్లు, పిండి వంటకాలతో సార సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతమ్మ వారికి కూడా సార సమర్పించారు.

భక్తులు వర్షాలు సకాలంలో కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు. మహిళలు భజనలు చేశారు. ఈ కార్యక్రమం గత పదేళ్లుగా కొనసాగుతోంది.

అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించగా, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com