హైదరాబాద్ 25°C
అమరావతి 32°C
IST 5:34 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

కేపీహెచ్బీలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కేపీహెచ్బీలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు
📷 Benhur Emmanuel / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని కేపీహెచ్బీ కాలనీ మూడవ ఫేస్‌లో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈ మహోత్సవాలను ఆధ్యాత్మిక వేత్త శ్రీ శంకర విశ్వేశ్వరానంద స్వామి పర్యవేక్షణలో గత 10 రోజులుగా నిర్వహించారు. విశేష పూజలు, అలంకరణలు, హోమాలు, కుంకుమార్చనలు, అభిషేకాలు, మండప పూజలు నిర్వహించారు.

ప్రముఖ నటుడు సుమన్ విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నటి కరాటే కళ్యాణి గతరాత్రి జరిగిన పూజల్లో పాల్గొని పురాణ గాధలకు సంబంధించిన హరికథ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com