హైదరాబాద్ 27°C
అమరావతి 28°C
IST 1:41 AM
ఆదివారం సెప్టెంబర్ 20 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

సినీ రంగంలో మహిళలకు 'కమిట్మెంట్' తప్పదు: ఇన్ఫ్లుయెన్సర్ వరలక్ష్మి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సినీ రంగంలో మహిళలకు 'కమిట్మెంట్' తప్పదు: ఇన్ఫ్లుయెన్సర్ వరలక్ష్మి
📷 cottonbro studio / Pexels
షేర్ కాపీ అయింది ✓

సినీ రంగంలో మహిళల పరిస్థితిపై ఇన్ఫ్లుయెన్సర్ వరలక్ష్మి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి అమ్మాయి ఈ రంగంలో ఒకరి కింద లొంగితే తప్ప ఎదగలేదని, అది 110% నిజమని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పెద్ద హీరోయిన్లతో సహా అందరూ ఎవరో ఒకరి దగ్గర లొంగే ఉంటారని, ఇది తాను కళ్ళారా చూశానని వరలక్ష్మి పేర్కొన్నారు.

తన స్వయంగా ఎదుర్కొన్న ఘోరమైన సంఘటనను కూడా ఆమె వివరించారు. ఒకసారి షూటింగ్ కోసం పిలిచి, తనను బలవంతం చేసే ప్రయత్నం చేశారని, తాను తప్పించుకొని వచ్చానని చెప్పారు. ఆ తర్వాత తన ఇంట్లో కొందరు వ్యక్తులు వచ్చి కూతురి ముందు తనపై దాడి చేశారని, దానితో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను సురక్షితంగా ఉన్నానని, తనను కాపాడిన వ్యక్తుల పట్ల కృతజ్ఞత ఉందన్నారు.

వరలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాలకు చెందినవారు. ఆమె సర్జరీ అసిస్టెంట్‌గా రాత్రి డ్యూటీ చేస్తూనే, పగలు డ్రెస్సెస్ షాపు నిర్వహిస్తున్నారు. భర్త నుంచి విడిపోయి 11 ఏళ్ల కూతుర్ని ఒంటరిగా చూసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 4.49 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సినిమాల్లో నటించాలనే కలతో చాలా ప్రయత్నాలు చేశానని, కానీ ప్రతిసారీ ఒకే సమస్య ఎదురైందని ఆమె తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com