హైదరాబాద్ 26°C
అమరావతి 31°C
IST 1:45 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆధ్యాత్మికం

వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) ప్రత్యేకత: వ్యాస మహర్షి జన్మదినం, గురు సంప్రదాయం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వ్యాస పూర్ణిమ (గురు పూర్ణిమ) ప్రత్యేకత: వ్యాస మహర్షి జన్మదినం, గురు సంప్రదాయం
📷 VARAN NM / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఆషాడ శుద్ధ పౌర్ణమి నాడు వేద వ్యాస మహర్షి జన్మించారు. ఈ పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా, గురు పూర్ణిమగా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.

వ్యాసుడు వేదములను నాలుగు భాగాలుగా విభజించి, పురాణములు, ఉపపురాణములు రచించాడు. ఆయన ధర్మ రక్షణ కోసం ద్వాపర యుగంలో అవతరించిన భగవత్ స్వరూపుడని భక్తుల విశ్వాసం.

వ్యాస మహర్షి శిష్యులు పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు, సుఖమహర్షి, రోమహర్షుణుడు. వీరు తమ గురువును కేవలం గురువుగా కాక, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల స్వరూపంగా కీర్తించారు. ఆ స్తుతిలో వ్యాసుడికి నాలుగు ముఖాలు (బ్రహ్మ), నాలుగు చేతులు (విష్ణు), నుదటి కన్ను (శివ) వంటి భౌతిక లక్షణాలు లేకుండా ఉన్నా, భగవంతుడి అంశగా భావించారు.

ఈ సంప్రదాయమే గురుపూర్ణిమ నాడు ప్రతి వ్యక్తి తన గురువును దైవంగా పూజించడానికి కారణమైంది. వ్యాస పూజతో పాటు తమ తమ గురువులను పూజిస్తారు. గురువును ఆరాధిస్తే దేవతల కృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com