హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 6:45 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

చేతులు లేకపోయినా కాళ్లతోనే రాస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్న పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయుడు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చేతులు లేకపోయినా కాళ్లతోనే రాస్తూ పిల్లలకు పాఠాలు చెబుతున్న పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయుడు
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు రెండు చేతులు లేకపోయినా కాళ్లతో బోర్డుపై రాస్తూ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఆయన పేరు జగన్నాథ్ మహతో. దాబతోరం నిమ్న బునియాది ప్రైమరీ స్కూల్‌లో గత 12 ఏళ్లుగా టీచర్‌గా పని చేస్తున్నారు.

పుట్టుకతోనే రెండు చేతులు లేని జగన్నాథ్, కాళ్లు కూడా సరిగా లేకపోయినా పట్టుదలతో చదువుకున్నారు. పురూలియాలోని బాగుముండి బ్లాక్ ప్రాంతంలో రైతు కుటుంబంలో జన్మించిన ఆయన, తన చెల్లి సాయంతో కాలితో రాయడం నేర్చుకుని విద్యనభ్యసించారు. 2006లో ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం సాధించిన జగన్నాథ్, 2012లో టెట్ పరీక్షలో అర్హత సాధించి టీచర్ అయ్యారు.

ప్రస్తుతం ఆయన తన పాఠశాలలో కాలితో బోర్డుపై రాస్తూ పిల్లలకు పాఠ్యాంశాలు నేర్పిస్తున్నారు. ఆయన తమ పిల్లలకు పాఠాలు చెప్పడం గర్వంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. కుటుంబ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com