ఏడాదికి ₹9.36 కోట్ల ప్యాకేజీ వదిలి సొంత AI స్టార్టప్ పెట్టిన యూసఫ్ ఇమ్రాన్
41 ఏళ్ల యూసఫ్ ఇమ్రాన్ గూగుల్‌లో భారీ జీతం పొందే సేల్స్ ప్రొఫెషనల్. గత ఏడాది ఆయన మొత్తం ఆదాయం ₹9.36 కోట్లు. బేసిక్ సాలరీ ₹1.61 కోట్లు కాగా, ఇన్సెంటివ్స్, కమిషన్లతో ఆదాయం భారీగా పెరిగింది. నెలకు దాదాపు ₹75 లక్షలు సంపాదించిన ఆయన, ఇటీవల ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
ఏఐ విప్లవం వెనకబడిపోతానేమోనన్న భయం, టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ వల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం ప్రధాన కారణాలని ఇమ్రాన్ తెలిపారు. పెద్ద కంపెనీల కంటే ఏఐ స్టార్టప్‌లలో వృద్ధి ఎక్కువని ఆయన గ్రహించారు. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ వంటి సంస్థలు ఇస్తున్న స్టాక్ ఆప్షన్లను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
ఉద్యోగం చేస్తూనే రాత్రిళ్లు, వారాంతాల్లో ఏఐ మోడల్స్ మీద ప్రయోగాలు చేశారు. ఆఫీస్ పని ముగిసిన తర్వాత నిద్ర పోకుండా కొత్త ఐడియాలపై పనిచేశారు. తన సేల్స్ అనుభవాన్ని ఉపయోగించి ‘మ్యాంగో స్టీన్ స్టూడియో’ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఇది సేల్స్ టీమ్స్ కోసం ప్రత్యేక ఏఐ టూల్స్ తయారు చేస్తుంది.
రెండేళ్లు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ₹3.42 కోట్లు ముందుగానే పొదుపు చేసిన తర్వాతే ఇమ్రాన్ రాజీనామా చేశారు. వ్యాపార ఖర్చులకు ₹2 కోట్లు, హౌసింగ్ లోన్, కుటుంబ ఖర్చుల కోసం ₹1.42 కోట్లు దాచారని ఆయన వివరించారు. కంపెనీ మొత్తం యాజమాన్యం తన వద్దే ఉంచుకోవాలని, బయటి ఇన్వెస్టర్లను తీసుకోలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com