బోయినపల్లి మహిళా ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ACB రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది
హైదరాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ నందిత మరియు కానిస్టేబుల్ విజయ్ కుమార్‌ను ACB అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేశారు.
ఓల్డ్ బోయినపల్లికి చెందిన అభిషేక్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదైంది. బెయిల్ పై వచ్చిన అభిషేక్ ప్రతి సోమవారం స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉండేది. ఈ పరిస్థితిని ఆసరగా చేసుకుని ఎస్ఐ కిరణ్ నందిత, కానిస్టేబుల్ విజయ్ కుమార్ అభిషేక్‌ను వేధించారు.
స్టేషన్‌లో గంటల కొద్దీ కూర్చోబెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సంతకం విషయంలో సహాయపడతామని చెప్పి లంచం డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ విజయ్ కుమార్ ₹10,000 వసూలు చేయగా, ఎస్ఐ కిరణ్ నందిత ₹30,000 డిమాండ్ చేసింది.
ఈ నెల 18న అభిషేక్ ACB అధికారులను ఆశ్రయించాడు. ACB అధికారులు వలపన్ని బుధవారం స్టేషన్ ప్రాంగణంలో లంచం తీసుకుంటున్న సమయంలో ఇద్దరినీ పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదు స్వాధీనం చేసుకుని ACB కేసు నమోదు చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com