హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 9:37 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం 28 అడుగులు దాటింది; 35-38 అడుగులకు చేరే అవకాశం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భద్రాచలం వద్ద గోదారి నీటిమట్టం 28 అడుగులు దాటింది; 35-38 అడుగులకు చేరే అవకాశం
📷 Fabio Partenheimer / Pexels
షేర్ కాపీ అయింది ✓

భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 28 అడుగులు దాటింది. నదిలో ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తోంది.

ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3-4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇంద్రావతి, ప్రాణహిత నదుల ద్వారా భారీ మొత్తంలో వరద నీరు భద్రాచలం గోదావరిలోకి చేరుతోంది.

కాళేశ్వరం, మహారాష్ట్ర, అదిలాబాద్ జిల్లాల నుంచి కూడా ఒక లక్ష క్యూసెక్కుల వరకు నీరు కలుస్తోంది. మొత్తం మీద దాదాపు 3.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో చేరడంతో నిన్న సాయంత్రం 16 అడుగులుగా ఉన్న నీటిమట్టం నేడు 28 అడుగులకు చేరింది.

రానున్న రెండు రోజుల్లో నీటిమట్టం 35 నుంచి 38 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ తర్వాత నీటిమట్టం తగ్గుతుందని తెలిపారు. ఛత్తీస్గడ్‌లో నిన్న మొన్న కురిసిన వర్షాల వల్ల వచ్చే నీరు భద్రాచలం చేరడానికి 1.5-2 రోజులు పడుతుందని, అప్పటి వరకు నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com