జలమండలి GM అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ACB సోదాలు: కోటిన్నర నగదు, బంగారం స్వాధీనం
హైదరాబాద్ మల్లాపూర్‌లో నివాసం ఉండే జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మి కుమార్ నివాసంలో ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎనిమిది ప్రాంతాల్లో కుమార్ బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఇప్పటివరకు కోటిన్నరకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
కిలోన్నరకు పైగా బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు సీజ్ చేశారు. నిజామాబాద్‌లో మూడు ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో ఆరు open plots, ఒక gated community లో మూడు flats గుర్తించారు. వాటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
కుమార్‌కు సంబంధించిన bank lockers కూడా ACB గుర్తించింది. అతన్ని custody కి తీసుకున్న తర్వాత వాటిని తెరిచే అవకాశం ఉందని సమాచారం. జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఇంట ఈ స్థాయిలో నగదు, ఆస్తులు దొరకడం అసాధారణమని ACB అధికారులు పేర్కొన్నారు.
కుమార్ జలమండలి GM గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందిన complaints అన్నింటినీ పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com