తెలంగాణ బ్రేకింగ్

హైదరాబాద్: మసాబ్ ట్యాంక్‌లో న్యాయవాదిపై కారుతో దాడి — పరిస్థితి విషమం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్: మసాబ్ ట్యాంక్‌లో న్యాయవాదిపై కారుతో దాడి — పరిస్థితి విషమం
📷 Sumit K Sharma / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లో న్యాయవాది ఖాజా మోయినుద్దీన్‌పై హత్యా ప్రయత్నం జరిగింది. ఉదయం ఆయన నివాసం నుంచి బయటికి వచ్చి కారు డోర్ తెరుస్తుండగా, దగ్గరకు వచ్చిన నల్లరంగు కారు అతనిని వేగంగా ఢీకొట్టింది. దెబ్బకు ఆయన కొన్ని మీటర్ల దూరం గాలిలో ఎగిరి పడ్డారు.

ప్రస్తుతం ఖాజా మోయినుద్దీన్‌ను స్థానిక ప్రైవేట్ hospital కు తరలించారు. వైద్యులు ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు.

డీకొట్టిన నిందితులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. నిందితుల గురించి కుటుంబ సభ్యులకు కూడా స్పష్టత లేదు.

CC footage ఆధారంగా కారు నంబర్ trace చేస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. న్యాయవాది వృత్తికి సంబంధించిన వ్యాజ్యాలతో ఈ దాడికి సంబంధం ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అయితే ఎవరు ఎందుకు దాడి చేశారో ఇంకా నిర్ధారించాల్సి ఉంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com