అమరావతిలో వరద ముప్పు: సింగపూర్ మాస్టర్ ప్లాన్‌లో 13,500 ఎకరాలు గుర్తింపు
అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతంలో వరద ముప్పు ఉందని సింగపూర్ మాస్టర్ ప్లాన్ స్పష్టంగా పేర్కొంది. 2017 master plan లో 13,500 ఎకరాలను వరద ముంపు ప్రాంతంగా గుర్తించి శేడింగ్ వేశారు.
మొత్తం ప్రాంతం 432 చదరపు కిలోమీటర్లు ఒకే వైపు వాలుతో ఉంది. కొండవీటివాగు, పాలవాగు catchment area నీరంతా ఒకే దిశలో ఉండవల్లి వైపు వస్తుందని నిపుణులు చెప్తున్నారు.
వరద నివారణకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఉండవల్లి దగ్గర మొదటిసారి ₹250 కోట్లతో lift లు నిర్మించారు. తాజాగా మరో ₹500 కోట్లు, ₹600 కోట్లతో రెండో దశ lift లకు కూడా అనుమతి ఇచ్చారు. వరద నివారణకు మూడు చెరువులు నిర్మిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుండి వరద నిర్వహణ కోసం నిధులు కూడా తీసుకుంటున్నారు.
పెనుమాక–కృష్ణాయపాళెం మధ్య 192 ఎకరాల మూడు పంటల వ్యవసాయ భూమిని తవ్వి చెరువు రిజర్వాయర్‌గా మారుస్తున్నారు. ఆ ప్రాంతంలో సహజంగానే 12 నుంచి 15 అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయని రైతులు చెప్తున్నారు. 30 అడుగులకు మించి బోరు వేయకుండానే నీళ్లు వస్తాయని స్థానిక రైతులు తెలిపారు.
నగరమంతా మునిగిపోతుందని చెప్పడం సరికాదని కొందరు అంటున్నారు. అయితే వరద ముప్పు మాత్రం ఉందని, దానికోసమే ఈ మౌలిక సదుపాయాలు నిర్మిస్తున్నారని స్పష్టమవుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com