హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 5:12 PM
శనివారం నవంబర్ 14 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

అమృత్‌పాల్ సింగ్‌కు ఒక రోజు మధ్యంతర బెయిల్.. అమ్మమ్మ అంత్యక్రియల కోసం పంజాబ్‌కు ప్రయాణం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
అమృత్‌పాల్ సింగ్‌కు ఒక రోజు మధ్యంతర బెయిల్.. అమ్మమ్మ అంత్యక్రియల కోసం పంజాబ్‌కు ప్రయాణం
📷 www.kaboompics.com / Pexels
షేర్ కాపీ అయింది ✓

పంజాబ్ ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కు కోర్టు ఒక రోజు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అమ్మమ్మ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ అనుమతి ఇచ్చింది.

అస్సాంలోని డిబ్రూగఢ్ జైలులో ఆయన జైలు జీవితం అనుభవిస్తున్నారు. అంత్యక్రియల కోసం నాలుగు రోజుల బెయిల్ కోరుతూ కుటుంబ సభ్యులు కోర్టును కోరారు. వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక రోజు మాత్రమే బెయిల్ ఇచ్చింది.

కోర్టు కొన్ని షరతులు విధించింది. డిబ్రూగఢ్ నుంచి పంజాబ్ వరకు ప్రయాణం, భద్రత, వాహనాల ఖర్చు ఆయనే భరించాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కేసుకు సంబంధించిన విషయాలు చర్చించకూడదు. 24 గంటల పోలీసు భద్రత ఆయనతో ఉంటుంది.

2023 ఏప్రిల్‌లో Waris Punjab De సంస్థ కార్యకర్తలు అజ్నాలా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి ఘర్షణకు దిగారు. ఈ ఘటనపై ఆయనపై FIR నమోదైంది. ఆ తర్వాత కేసులు నమోదు కావడంతో పంజాబ్‌లో ఉద్రిక్తత నెలకొంది. 2024 ఎన్నికల్లో ఆయన జైలులో ఉండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.

15 రోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న అమ్మమ్మతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమె మరణం తర్వాత అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి కోరారు. ప్రస్తుతం ఆయన హై సెక్యూరిటీ మధ్య పంజాబ్‌కు బయలుదేరారు. పంజాబ్ పరిసర ప్రాంతాల్లో భద్రత పెంచారు. అస్సాంలో ఉండటంతో ప్రయాణానికి సమయం ఎక్కువ పడుతోందని, దీనితో అంత్యక్రియలు కొంత ఆలస్యం అవుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com