నల్లమలలో 11-16 శతాబ్దాల నాటి 10 రాతి శాసనాలు గుర్తింపు
మార్కాపురం జిల్లా నల్లమల అడవిలో పురావస్థ శాఖ చేపట్టిన పరిశోధనలో 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం మధ్యకాలం నాటి 10 రాతి శాసనాలు బయటపడ్డాయి.
శుక్రవారం రెండో రోజు పరిశోధనలో భాగంగా అయ్యంబొట్లపల్లి, చాపల మడుగు, ఎర్రగొండపాలెం సమీపంలోని పురాతన చెరువు కట్టపై ఈ శాసనాలు లభ్యమయ్యాయి. ఈ శాసనాలు కళ్యాణి చాలుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పొత్తాపి చోలుల సామ్రాజ్యాలకు చెందినవి.
వీటిలో ఒకటి కళ్యాణి చాలుక్యులు కన్నడ భాషలో వేసిన శాసనం, మిగతా తొమ్మిది తెలుగు లిపిలో ఉన్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి, త్రిపురాంతకం ఆలయానికి భూములు, గ్రామాలు దానంగా ఇచ్చిన వివరాలు ఇందులో నమోదయ్యాయని పురావస్థ శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తెలిపారు.
కాకతీయ గణపతి దేవుని సామంతుడైన గంగయ్య సాహిని అనే రాజు త్రిపురాంతకం ఆలయానికి భూములు ఇచ్చినట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ శాసనాలపై మరింత విశ్లేషణ చేపట్టనున్నట్టు డైరెక్టర్ చెప్పారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com