పాఠశాల విద్యార్థులకు AI అవగాహన కల్పించేందుకు కొత్త పాఠ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు AI అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పాఠ్యాంశాలు ప్రవేశపెట్టింది. రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి (SCERT) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.
6, 7, 8 తరగతుల గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో AI ని మిళితం చేసి బోధిస్తారు. AI ని సురక్షితంగా వాడటం, సరైన ప్రశ్నలు అడగడం నేర్పిస్తారు. వ్యక్తిగత వివరాలు AI తో పంచుకోకూడదని, AI సమాధానాలను నేరుగా homework లో copy చేయకూడదని విద్యార్థులకు సూచిస్తారు.
6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలో AI ని సహాయ సాధనంగా మాత్రమే చూడాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలోనే AI వినియోగించాలని సూచించారు. AI కి సొంతంగా ఆలోచించే శక్తి లేదని, దానికి అందించిన సమాచారంపై మాత్రమే ఆధారపడుతుందని పాఠ్యాంశంలో తెలిపారు.
కొత్త పాఠ్యపుస్తకాల్లో మరికొన్ని మార్పులు కూడా చేశారు. ఈ ఏడాది 5వ తరగతిలో హిందీ ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు 6వ తరగతి నుంచి హిందీ ఉండేది. 1వ తరగతి నుంచే English phonetics ప్రవేశపెట్టారు. 9వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సామర్థ్య ఆధారిత మూల్యాంకనానికి అనుగుణంగా ప్రశ్నలు చేర్చారు.
9వ తరగతి తెలుగు వాచకం నుంచి 'హరివిల్లు రంగస్థలం' పాఠం, ఉపవాచకం నుంచి న్యాపతి సుబ్బారావు, కొండా వెంకటప్పయ్య, దిగుమర్తి జానకీబాయమ్మ, కల్లూరి తులసమ్మ పాఠ్యాంశాలు తొలగించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com