అనిరుధ్-కావ్య మారన్ వివాహ వార్తలపై వై.జి. మహేంద్రన్ వ్యాఖ్యలు
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ల వివాహం గురించి సోషల్ మీడియాలో కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా తమిళ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింతగా తెరపైకి తెచ్చాయి.
అనిరుధ్ కు బంధువైన మహేంద్రన్, "అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్. ఇంతవరకు పెళ్లి కాలేదు కానీ త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు" అని చెప్పారు. కావ్య మారన్ ను ప్రశంసిస్తూ, తండ్రి కళానిధి మారన్ నుంచి వ్యాపార దక్షత అందుకున్నారని తెలిపారు. ఒకవేళ వీరిద్దరికీ పెళ్లి అయితే "మ్యూజికల్ బిజినెస్" చేస్తారేమోనని సరదాగా అన్నారు.
ఈ వ్యాఖ్యలతో ఊహాగానాలు ఊపందుకున్నా, ఇప్పటి వరకు ఇరువర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అనిరుధ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతకి మేనల్లుడు కావడం, కావ్య మారన్ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాని కావడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com