హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 2:41 PM
బుధవారం జూలై 29 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సినిమా

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనవ్వ ఇకపై తనను అన్నా కొనిదలగా పిలవాలని విజ్ఞప్తి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనవ్వ ఇకపై తనను అన్నా కొనిదలగా పిలవాలని విజ్ఞప్తి
📷 Khánh LP / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనవ్వ తన పేరు విషయంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్ట్‌లో ఆమె అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు.

తనను ఇకపై అన్నా లెజనవ్వ కాకుండా, వివాహం తర్వాత భర్త ఇంటి పేరు అయిన అన్నా కొనిదల అని పిలవాలని ఆమె కోరారు. ఈ విషయాన్ని చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, కానీ సరైన పద్ధతిలో చెప్పడం ఎలాగో తెలియక ఆలస్యమైందని ఆమె తెలిపారు. మా వివాహ ధృవీకరణ పత్రంలో అన్నా లెజినోవా అని ఉంది, కానీ వివాహం అయింది మొదలు నేను భర్త ఇంటి పేరు స్వీకరించానని ఆమె వివరించారు.

ఈ పోస్ట్‌లో ఆమె తన భర్తతో కలిసి మొదటి పర్యటనలో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్‌లో తీసుకున్న ఒక ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com