ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు విజన్‌తో ఏపీ బ్రాండ్ వాల్యూ పునరుద్ధరణ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
చంద్రబాబు విజన్‌తో ఏపీ బ్రాండ్ వాల్యూ పునరుద్ధరణ
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఆంధ్రప్రదేశ్‌లో వైసపి పాలన సాగిన ఐదేళ్ల కాలంలో పారిశ్రామిక రంగం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రాజకీయ కక్షలు, వేధింపులతో పారిశ్రామిక వేత్తలు గగ్గోలు పెట్టారు. ఫలితంగా పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళాయి. ఏపీ బ్రాండ్ వాల్యూ భారీగా పతనమైంది.

అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పరిస్థితి సంపూర్ణంగా మారింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పారిశ్రామిక రంగం గాడిన పడింది. నాడు పారిపోయిన కంపెనీలే నేడు రాష్ట్రానికి తిరిగి వస్తున్నాయి. కొత్త గ్లోబల్ ఇన్వెస్టర్లు సైతం ఏపీకి క్యూ కడుతున్నారు.

2024 జూన్ నుంచి రెండేళ్ల వ్యవధిలో వివిధ సంస్థలతో సుమారు 21.64 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటి ద్వారా సుమారు 23 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి రావడం ఏపీ బ్రాండ్ వాల్యూకు నిదర్శనం.

వైసపి హయాంలో 2014-19 మధ్య TDP సర్కార్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్న లూలు గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదాని డేటా సెంటర్, అమర్‌రాజా బ్యాటరీస్ వంటి సంస్థలు పెట్టుబడుల ప్రతిపాదనలను ఉపసంహరించాయి. అమరావతిని ధ్వంసం చేయడం, భూముల సమీక్ష పేరుతో ఇబ్బందులు పెట్టడం వంటి చర్యలతో పెట్టుబడిదారులు భయాందోళకు గురయ్యారు.

కూటమి సర్కార్ ఐదేళ్ల విధ్వంసాన్ని అధిగమించి కోల్పోయిన బ్రాండ్ వాల్యూను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టింది. అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖలో ఏర్పాటు చేస్తోంది. దీన్ని 13 నెలల్లో గ్రౌండింగ్ చేయడం ప్రభుత్వం వేగవంతమైన నిర్ణయాలకు నిదర్శనం. ప్రకాశం జిల్లాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లక్ష కోట్లతో చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పుట్టపర్తిలో కేవలం 36 రోజుల్లోనే 15 వేల కోట్లతో యుద్ధ విమానాల ప్రాజెక్ట్ గ్రౌండింగ్ చేసింది.

2025 నవంబర్‌లో విశాఖ భాగస్వామ్య సదస్సులో వివిధ సంస్థలతో 538 MOU లు కుదుర్చుకున్నారు. వాటి ద్వారా 11.37 లక్షల కోట్ల పెట్టుబడులు, 14.03 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపాయి. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు 218 సంస్థలు 10.27 లక్షల కోట్ల పెట్టుబడులకు నేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నియోజక వర్గానికి ఒకటి చొప్పున 175 MSME పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దాదాపు 40-45 MSME పార్కులను ప్రారంభించడం జరిగింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2500 కోట్లతో ఏపీలో తయారీ యూనిట్ నెలకొలుపుతోంది.

ప్రభుత్వం 22 రకాల సెక్టోరియల్ పాలసీలను తీసుకొచ్చింది. LIFT పాలసీ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ ద్వారా ఎకరానికి కేవలం 99 పైసలకు మాత్రమే లీజ్ స్థలాన్ని ఇచ్చి ఎలక్ట్రానిక్ మరియు టెక్ రంగాల్లో విప్లవాత్మకమైన కేటాయింపు ద్వారా పెట్టుబళ్ళకు మార్గం సుగమం చేశారు. విశాఖపట్నాన్ని సిలికాన్ కారిడార్‌గా, అమరావతిని ఆవిష్కరణ కేంద్రంగా, క్వాంటం వాలీగా అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోంది.

దావోస్ ఆర్థిక సదస్సు, సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం, UAE మధ్యప్రాచ్య దేశాల్లో రోడ్ షోలు, సింగపూర్ వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొని పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం విశేష కృషి చేసింది. ఏపీ నుంచి 100 యూనికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com