ఏపీలో సినిమా షూటింగ్‌లకు సింగిల్ విండో ఫాస్ట్‌ట్రాక్ అనుమతులు
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతులు పొందడంలో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ భరత్ భూషణ్, ఏపీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్, పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు ఒక ఉన్నతస్థాయి సమావేశంలో వివిధ ప్రతిపాదనలను పరిశీలించారు.
షూటింగ్ అనుమతుల మంజూరీలో వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించాలని సమావేశం నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో ఫాస్ట్‌ట్రాక్ ప్రాతిపదికన త్వరగా మంజూరు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఈ నిర్ణయం వల్ల చిత్ర నిర్మాతలకు నిరుత్సాహపరిచే ఆలస్యం తగ్గుతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో విజయవంతగా జరుగుతున్న షూటింగ్లకు మరింత ఊతం లభిస్తుందని చైర్మన్ భరత్ భూషణ్ తెలిపారు. నూతన విధానం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్ సినీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com