AP లో జనన రేటు తగ్గుతోంది — చంద్రబాబు ఎక్కువ పిల్లలు కనమని ఎందుకు చెప్తున్నారు?
ఆంధ్రప్రదేశ్ లో fertility rate 1.5కి పడిపోయింది. NFHS (National Family Health Survey) ప్రకారం ఒక తరాన్ని తర్వాతి తరం replace చేయాలంటే fertility rate కనీసం 2.1 ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో అది ఆ స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో AP CM చంద్రబాబు నాయుడు ముగ్గురు నలుగురు పిల్లలు కనాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
జనన రేటు తగ్గిపోతే దీర్ఘకాలంలో పలు సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. పని చేసే వయసు జనాభా తగ్గిపోతుంది. అదే సమయంలో 60 ఏళ్ళు దాటిన వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. తక్కువ మంది యువత ఎక్కువ మంది వృద్ధులను support చేయాల్సి వస్తుంది. Economy మందగిస్తుంది. Pension భారం పెరుగుతుంది. Schools మూతపడతాయి.
ఇదే సమస్య ఇప్పటికే చైనా, జపాన్ దేశాల్లో కనిపిస్తోంది. చైనా ఒకప్పుడు ఒక్క పిల్లవాడు చాలు అని నిర్బంధ విధానం అమలు చేసింది. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా కనండని ప్రోత్సహిస్తోంది. జపాన్‌లో చాలా పట్టణాలు వృద్ధుల జనాభాతో నిండిపోయాయి.
రాజకీయంగా కూడా ఈ అంశం ముఖ్యమైనది. జనాభా ఆధారంగా Lok Sabha స్థానాలు కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. Delimitation చర్చలో ఇది ఒక కీలకమైన అంశంగా నిలిచింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com