విజయవాడ విమానాశ్రయంలో ఎబోలా స్క్రీనింగ్ కేంద్రం ఏర్పాటు
ఆఫ్రికాలో ఎబోలా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే బయటికి అనుమతిస్తారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. వైరస్ లక్షణాలు ఎవరికీ లేవని తేల్చారు.
లక్షణాలు కనిపించిన వారిని క్వారెంటైన్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అదనంగా, వైద్య ఆరోగ్య శాఖ విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com