హైదరాబాద్ 29°C
అమరావతి 30°C
IST 11:23 AM
శనివారం అక్టోబర్ 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్

ఏపీకి భారీ వర్ష హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీకి భారీ వర్ష హెచ్చరిక: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది
📷 Dibakar Roy / Pexels
షేర్ కాపీ అయింది ✓

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. ఇది ఈరోజే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఏపీపై ఈ వ్యవస్థ ప్రభావం కనిపించనుంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని అధికారులు చెప్తున్నారు.

అల్పపీడన ప్రభావంతో ఈరోజు విజయనగరం, కృష్ణ, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రేపు, ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల అర్నబ్ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వరదలు సంభవించాయి. జిల్లాలో బహుదా నది వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. దీంతో ఇచ్ఛాపురం దగ్గర 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఈరోజు వరద ఉధృతి కొంత తగ్గడంతో పోలీసులు రాకపోకలను పునరుద్ధరించారు. రోడ్డుపై ఇంకా నీరు ప్రవహిస్తుండడంతో, డివైడర్‌కు ఒకవైపు నుంచి ఒక్కో వాహనాన్ని నెమ్మదిగా అనుమతిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com