హైదరాబాద్ 25°C
అమరావతి 32°C
IST 12:27 PM
గురువారం జూలై 30 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్: మంత్రి లోకేష్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీలో 3,168 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్: మంత్రి లోకేష్
📷 Ntrtrust / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

మంత్రి నారా లోకేష్ ఏపీలో నిరుద్యోగ యువతకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. జాబ్ క్యాలెండర్ 2026 పై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండో దశ నోటిఫికేషన్‌ను సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

ఈ దశలో వివిధ శాఖల్లోని 3,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈ నోటిఫికేషన్ గతంలో ఆగస్టులో రావాల్సి ఉండగా, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించిన సాంకేతిక కారణాల వల్ల సెప్టెంబరుకు వాయిదా పడిందని మంత్రి వివరించారు.

మూడు, నాలుగు దశల కింద 5,369 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. గ్రూప్-1 పోస్టుల సంఖ్యను మరింత పెంచాలని కూడా సూచించారు. నోటిఫికేషన్ల విడుదల పగట్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com