ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు: చంద్రబాబు సంకేతాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఎన్నికల నిర్వాహణకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో వార్డుల విభజనకు సంబంధించి కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, ఓటర్ జాబితాల తయారీ, సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమీక్షించారు. ఎన్నికల నిర్వాహణకు అవసరమైన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం మొదట మున్సిపల్ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్-నవంబర్ నెలల్లోపు పూర్తి చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com