హైదరాబాద్ 27°C
అమరావతి 28°C
IST 10:33 AM
శుక్రవారం నవంబర్ 13 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికల తొలిదశకు నేడు నోటిఫికేషన్: 26న 4,180 పంచాయతీల్లో పోలింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
పంచాయతీ ఎన్నికల తొలిదశకు నేడు నోటిఫికేషన్: 26న 4,180 పంచాయతీల్లో పోలింగ్
📷 Sandeep Kashyap / Pexels
షేర్ కాపీ అయింది ✓

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 26న తొలిదశలో 4,180 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.

ఒక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకూ ఒకే దశలో ఎన్నికలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలోని పంచాయతీలను విభజించి మూడు దశల్లో చేర్చాలన్న ప్రణాళికను ఎన్నికల సంఘం విరమించుకుంది.

నామినేషన్లు స్వేచ్ఛగా వేసుకోవచ్చని, అవసరమైతే భద్రత కల్పిస్తామని ఎస్ఈసి భరోసా ఇచ్చింది. అవసరమైన చోట అదనపు నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఎక్కడైనా ఇబ్బంది తలెత్తితే జిల్లా కలెక్టర్, ఎస్పి నిర్ణయం తీసుకుంటారు. జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ నామినేషన్ కేంద్రం పెట్టవచ్చు.

అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. అవసరమైతే పోలీస్ ఎస్కార్ట్‌తో వారిని నామినేషన్ కేంద్రాలకు తీసుకెళ్తారు. నామినేషన్ కేంద్రాల్లో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం సీసీటీవీ కవరేజ్ లేదా వీడియోగ్రఫీ ఉంటుంది. ఏదైనా ఫిర్యాదు వస్తే వెంటనే నిబంధనల ప్రకారం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com